Share News

kumaram bheem asifabad-నేతలకు వినాయక చెందాల సెగ

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:16 PM

నవరాత్రి ఉత్సవాల వేళ నేతలకు వినాయక చెందాల సెగ తగు లుతోంది. సర్పంచ్‌ నుంచి ఆపై నేతులు, భవిష్యత్తులో పోటీలో నిలనవాలని తహతహలాడే వారిని నిర్వాహకకులు చెందాలు ఎక్కువగా రాయాలని కోరుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఊరూవాడ వైభవంగా నిర్వహిస్తారు. గతంలో ఊరిలో కానీ... కాలనీలో కానీ ఒకే చోట గణపతి మండపాన్ని ఏర్పాటు చేసేవారు.

kumaram bheem asifabad-నేతలకు వినాయక చెందాల సెగ
లోగో

వాంకిడి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి ఉత్సవాల వేళ నేతలకు వినాయక చెందాల సెగ తగు లుతోంది. సర్పంచ్‌ నుంచి ఆపై నేతులు, భవిష్యత్తులో పోటీలో నిలనవాలని తహతహలాడే వారిని నిర్వాహకకులు చెందాలు ఎక్కువగా రాయాలని కోరుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఊరూవాడ వైభవంగా నిర్వహిస్తారు. గతంలో ఊరిలో కానీ... కాలనీలో కానీ ఒకే చోట గణపతి మండపాన్ని ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వీధికో మండపం పెడుతున్నారు. కొందరు సొంత నిధులు ఖర్చు చేస్తుండగా.. ఎక్కువగా చందాలపై ఆధారపడతారు. చందాల కోసం స్థానిక నాయకుల నుంచి మొదలుకుని శాసనసభ్యులు, ఎంపీల వరకు ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతుంటారు. కొద్ది నెలల క్రితం గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో చందాల కోసం టీకెట్‌ కోసం ఆధిస్తున్న నేతల చూట్టుకూడా తిరుతున్నారు.

- చందాలకు నిధులు గండం..

తాము సర్పంచ్‌లుగా గెలిచి 9 నెలలు గడుస్తున్న ప్పటికీ ఎలాంటి నిధులు రాలేదని సర్పంచ్‌లు వాపోతున్నారు. ఎలక్షన్లలోనే లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు రూ. వేలల్లో చందాలు రాయాలంటే అప్పులు చేయకతప్పడం లేదని వాపోతున్న పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. వార్డు సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు లేకున్నా ఎన్నికల సమయంలో వారిచ్చిన హామిలను నిర్వాహకులు గుర్తుచేస్తున్నారు. గత ఫిబ్రవరిలో జిల్లాలోని రెండు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంల ోనూ గెలుపు కోసం వినాయక ఉత్సవాల హామీలు సైతం గుప్పించారు. ఇప్పుడు చైర్మన్లు, కౌన్సిలర్లుగా ఎన్నికైనవారు చందాల కోసం తర్జనభర్జన పడుతు న్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు కూడా చందాల చిక్కు తప్పడంలేదు. వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీల సభ్యులు వారిని స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. ఒక్కరికి ఇస్తే అందరికీ ఇవ్వాల్సి వస్తుందని కొందరు తప్పించుకుంటుండగా విగితావారు మత్రం ఎంతోకొంత ఇస్తున్నారు. కనీసం రూ. 10వేలైనా చందా రాయక తప్పడం లేదు. మండల కేంద్రాలు, ప్రధాన సెంటర్లలో కొంత ఎక్కువ ఇస్తున్నారు. ఎంతో కొంత ఇచ్చానా నియోజకవర్గంలో లక్షల్లో ఖర్చుఅవుతుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు నేతలు తామే స్వయంగా వచ్చి గణప తులను దర్శించుకుని చందాలు ఇస్తామని తప్పించు కుంటున్నారు.

- ఎన్నికల రేసులో ఉన్నవారిపై గురి...

త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ప్రచారం జరుతుండ డంతో ఆయా ఎన్నికల్లో పోటీచేసేవారిపై ఉత్సవ కమిటీలు గురిపెడుతున్నారు. వారిని కలిసి ఎన్నికల్లో మీ వెంటే ఉంటాం.. గణపతి చందాలు రాయాలని కోరుతున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో తెలియక ఆశావాహులు తర్జనభర్జన పడుతున్నారు. చందాలు ఇవ్వకుంటే ఎన్నికల్లో ప్రతికూలత ఏర్పడుతుందే మోనని ఆలోచిస్తున్నారు. తాజా పరిణామాలకు తలొగ్గి భారీగా డబ్బులు ఖర్చు చేయడంకంటే వచ్చే పదిరోజులు ఏదో ఒక కారణంతో అజ్ఞాతంలో ఉంటే మంచిదని ఆలోచిస్తున్న నాయకులు సేతం లేకపోలేరు. కాగా చందాలు వచ్చినా..రాకున్నా నవ రాత్రి ఉత్సవాలను ఘనంగా ముగించడానికి ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి.

Updated Date - Sep 18 , 2026 | 11:16 PM