Share News

kumaram bheem asifabad-గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:53 PM

గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి తెలిపారు. కాగజ్‌నగర్‌లో వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసే మండపాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేశ్‌ నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలన్నారు

kumaram bheem asifabad-గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
పెద్దవాగు పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి తెలిపారు. కాగజ్‌నగర్‌లో వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసే మండపాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేశ్‌ నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా కూడా అధికారులు దృష్టికి తీసుకరావాలన్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో డీఎస్పీ వహిదుద్దీన్‌తో చర్చించారు. అనంతరం పెద్దవాగులో నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ మధూకర్‌, సిబ్బంది ఉన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): హియరింగ్‌ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి తెలిపారు. దహెగాం తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు వచ్చిన వారికి హియరింగ్‌ నిర్వహించే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సరి చూసుకోవాలన్నారు. అనంతరం ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. అలాగే సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, ఆర్‌ఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 10:53 PM