kumaram bheem asifabad-భక్తిశద్ధ్రలతో గణేశ్ నిమజ్జనం
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:05 PM
ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలాల్లో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర నిర్వహించారు.
- ఇబ్బందులు కలుగకుండా అధికారుల చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలాల్లో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యువతి, యువకులు నృత్యం చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని బ్రాహ్మణవాడ గణేశ్‌మందిర్, వాసవి విద్యా మందిర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహలను పెద్దవాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుదవారం గణేశ్ నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా గ్రామాల్లో వినాయకున్ని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు, వివిద రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గ్రామాల్లో భాజాభజంత్రీల మద్య సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు. అంతకు ముందు అన్ని మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా కౌటాల సీఐ సంతోష్‌కుమార్ ఆద్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని డబ్బా, కర్జెల్లి, గూడెం, చింతలమానేపల్లి, గంగాపూర్, బాబాసాగర్ తదిదతర గ్రామాల్లో వినాయక నిజ్జన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా, అధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. డోలు యిద్యాలు, యువకుల నృత్యాలు గణపతి బొప్పా మోరియా అంటూ శోభయాత్రలను నిర్వహించారు. అనంతరం జలశయాల్లో స్వామి వారి విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు లడ్డూవేలం పాటం నిర్వహించారు.
పెంచికల్‌పేట్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో భక్తలు గణనాథలకు శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గణేశ్ నిమజ్జ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కూడళ్లలో ప్రతిష్టించిన గణనాథుడికి తొమ్మిది రోజులుగా నిత్య పూజలు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. దహెగాంలో వర్షంలోనే శోభాయాత్ర చేపట్టారు. ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో బుధవారం గణేష్ నిమజ్జనం వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెబ్బెన గణేష్ విగ్రహాలను గంగాపూర్ వాగులో, గోలేటి విగ్రహాలలను పులికుంట వాగులో నిమజ్జనం చేశారు. ఎస్సై వెంకట కృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో . శివాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో వీడ్కోలు పలికారు. అనంతరం సమీపంలోని వాగులో గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.