గండి పేట భూకబ్జా కేసులో హైకోర్టుకు బొల్లా బ్రహ్మనాయుడు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:41 AM
నకిలీ జీవోలు, తప్పుడు పత్రాల ఆధారంగా హైదరాబాద్ గండిపేటలో రూ.1500కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన వ్యవహారంలో నిందితుడు....
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): నకిలీ జీవోలు, తప్పుడు పత్రాల ఆధారంగా హైదరాబాద్ గండిపేటలో రూ.1500కోట్ల విలువైన భూమిని కబ్జా చేయాలని చూసిన వ్యవహారంలో నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్‌కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గండిపేట సర్వేనం.18లో నకిలీ పత్రా లు, జీవోలు సృష్టించి ఎలాంటి హక్కులు లేకపోయినా భూ ముల అమ్మకాలకు ఒప్పందాలు చేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఇటీవల ఛేదించారు. ఈకేసులో ఫోర్జరీ పత్రాలు తయారు చేసిన రాజేశ్‌గౌడ్, వేణు గోపాల్, సాయి కిరణ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు.