గాంధీ సరోవర్‌కు వారంలో శంకుస్థాపన
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:26 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వారం రోజుల్లోపే శంకుస్థాపన జరగనుంది.
హైదరాబాద్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వారం రోజుల్లోపే శంకుస్థాపన జరగనుంది. ఈనెల 16వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చ తర్వాత ఒక తీర్మానాన్ని కూడా సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు సౌదీ అరేబియా నుంచి ఒక ఆసక్తికర ప్రతిపాదన వచ్చింది. మూసీ ఒడ్డున అతి భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆసక్తి చూపించారని తెలిసింది. కాగా ఉస్మానియ ఆసుపత్రిని గోషామహల్‌కు తరలిస్తుండటంతో అక్కడున్న 25 ఎకరాలు ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. ఇక్కడ హైటెక్స్‌ను మించి అంతర్జాతీయ స్థాయిలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు.