Share News

kumaram bheem asifabad- జూదం.. స్మార్ట్‌గా..

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:20 PM

ఒకప్పుడు పేకముక్కలు, చీటీల ఆధారంగా నడిచిన మాట్కా జూదం అంతమైందని అంతా భావించారు. కానీ చేతికి అందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఆన్‌లైన్‌లో మొదలు కావడంతో మరింతగా కొనసాగుతోంది. పేద, మధ్య తరగతి జనాలు, కూలీలు ఆకర్షితులవుతుండడంతో ఏజెంట్టు అందినకాడికి దండుకుంటున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా మట్కా జూదం కొనసాగుతోంది.

kumaram bheem asifabad- జూదం.. స్మార్ట్‌గా..
లోగో

- ఆన్‌లైన్‌లో ఆట.. చేతులు మారుతున్న రూ. లక్షలు

కాగజ్‌నగర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పేకముక్కలు, చీటీల ఆధారంగా నడిచిన మాట్కా జూదం అంతమైందని అంతా భావించారు. కానీ చేతికి అందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఆన్‌లైన్‌లో మొదలు కావడంతో మరింతగా కొనసాగుతోంది. పేద, మధ్య తరగతి జనాలు, కూలీలు ఆకర్షితులవుతుండడంతో ఏజెంట్టు అందినకాడికి దండుకుంటున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా మట్కా జూదం కొనసాగుతోంది. ఈ జూదంతో ఎంతో మంది యువత పెడదారిన పడుతుండఛింతో పోలీసులు పోలీసులు పక్కాగా నిఘా పెట్టేసి ఈ ఆట ఆడే వారిపై కేసులు పెట్టేస్తున్నారు. మహారాష్ట్రలోనే ఈ ఆటకు అధికారికంగా అనుమతులు ఉన్నాయి. కానీ తెలంగాణలో దీన్ని నిషేధించారు. మహారాష్ట్రకు పొరుగున ఉండడంతో జిల్లాలోని పలువురు దీన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఈ మేరకు నిర్వహకులు జిల్లాలో కొంత మంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారు. గతంలో ఈ దందా ఆఫ్‌లైన్‌లో ఆడే వారు. తరుచూ పోలీసులు దాడులు చేస్తుండడంతో వీరంతా ఇప్పుడు పంతా మార్చేసి ఏకంగా ఆన్‌లైన్‌ ద్వారా ఆడుతున్నారు. స్థానికంగా పలువురు ఏజేంట్లుగా చలామణి అవుతూ జూదరుల నుంచి వాట్సాప్‌ ద్వారా నంబర్లను నగదును సేకరిస్తున్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాను నిర్వహిస్తున్నారు.

- పలు సంస్థల పేరిట..

మహారాష్ట్ర కేంద్రంగా రాజధాని, కళ్యాణ్‌; మెయిన్‌ ముంబాయి, శ్రీదేవి, టైం, మిలన్‌, తదితర సంస్థల పేరిట సాయంత్రం, రాత్రి నాలుగు సార్లు ఒక్క నంబరు చొప్పున విడుదల చేస్తారు. ఈ సంఖ్య ఎమిటని ముందుగా చెప్పి పందెం కాయటమే మట్కా ఆట. ఇందులో 0-9 వరకు ఏదో ఒక అంకెను ఎంచుకొని ఓపెన్‌, క్లోజ్‌, బ్రాకెట్‌గా కేటాయించుకుని ఆడాల్సి ఉంటుంది. ఓపెన్‌కు రూ.100కి రూ.1000, క్లోజ్‌కు రూ.100కు రూ.1000, బ్రాకెట్‌కు రూ.10కి రూ.1000, పానాకు రూ.10కి రూ.1300 నగదను చెల్లిస్తారు. ఆట సమయానికి ముందే రాబోయే అంకెను చెబుతామంటూ పలువురు ఆన్‌లైన్‌లో వీడియోలు పెడతూ మోసాలకు పాల్పడుతున్నారు. అనేక మంది యువత హైదరాబాద్‌, మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాల్లో అద్దెకుంటూ ఇదే పని చేస్తున్నారు. ముందు రోజు వచ్చిన నంబర్లను ఆట సమయానికి ముందే చెప్పామంటూ వాట్సాప్‌లో గ్రూపులు ఏర్పాటు చేస్తూ యూట్యూబ్‌, ఇన్‌ స్ట్రాగాం, ఫేస్‌బుక్‌లలో వీడియోలు పెడుతున్నారు. ఇలా వీడియోలు తీసి పోస్టింగ్‌ చేసే వారిని స్థానికంగా పోస్టర్‌గా పిలుస్తారు.

- తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు..

ఆన్‌లైన్‌ కావడంతో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి సైతం వీరిని సంప్రదించి మోసపోతున్నారు. మోస పోయిన వారు ఫిర్యాదు చేయక పోవడంతో వీరి ఆగడాలకు ఆడ్డుకట్ట లేకు పోతోందని అధికారులు చెబుతున్నారు. బెజ్జూరు మండలం గొల్కొండ కాలనీలో ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్న మెరుగు అంజన్నను ఈ నెల 18న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇన్‌స్ట్రాగ్రాం, ఫేస్‌బుక్‌, ఫేస్‌ బుక్‌ ఐడీల ద్వారా మట్కా నంబర్లను ప్రచారం చేస్తూ ఈ ఆటలో ఆడే వారిని నిలువెల్లా మోసం చేస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ(కె) చెందిన షేక్‌ సిరాజ్‌ మట్కా నిర్వహిస్తుండగా, ఈ నెల 19న పోలీసులు పట్టుకున్నారు. సెల్‌ ఫోన్‌ వీడియోలు తీయడం, మట్కా నంబర్లను ప్రింట్‌ తీస్తూ యూట్యూబ్‌, ఫేస్‌ బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆట నంబర్లను ముందే చెబుతానంటూ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో లాడ్డీల్లో ఉంటూ ఈ దందా నిర్వహిస్తున్న వారిపై హైదరాబాద్‌ పోలీసులు పక్కాగా నిఘా పెట్టి ఇప్పటికీ పది మందికిపైగా అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిఘా ఎక్కువ ఉండడంతో మహారాష్ట్రకు మాకాం మార్చారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఈ దందాను నడిపిస్తున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ ప్రేంకుమార్‌ను వివరణ కోరగా యువత మట్కా ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దరి చెప్పారు. మట్కా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Aug 21 , 2026 | 11:20 PM