మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా..గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - May 22 , 2026 | 04:42 AM
రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
రాంగోపాల్‌పేట్, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సికింద్రాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, మహిళా నేతలు హాజరయ్యారు. విజయలక్ష్మితో పాటు కమిషన్ నూతన సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్‌రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా ఆయేషా షాకీర్ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిషన్ పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రులు జి. వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.