Share News

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి

ABN , Publish Date - May 12 , 2026 | 03:41 AM

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి

  • శ్రీకాంతాచారి తల్లి, ఐలమ్మ మనవరాలు సహా ఆరుగురికి సభ్యులుగా అవకాశం

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్‌ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్‌.రాధాబాయి, ఉజ్మా ఆషాయి షకీరాలను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవుల్లో ఉంటారు.

Updated Date - May 12 , 2026 | 03:41 AM