Share News

kumaram bheem asifabad- వైభవంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:04 PM

జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని గురువారం వైభవంగా జరుపుకున్నారు. జిల్లాలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో దైవదర్శనాలు చేసుకున్నారు, మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఇళ్లను శోభాయమానంగా కళకళలాడాయి.

kumaram bheem asifabad- వైభవంగా ఉగాది వేడుకలు
ఆసిఫాబాద్‌లో పంచాంగ శ్రవణం వినిపిస్తున్న అర్చకులు

- పంచాంగ శ్రవణంలో పండితులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/చింతలమానేపల్లి/కెరమెరి/పెంకలపేట/వాంకిడి/బెజ్జూరు/దహెగాం/ సిర్పూర్‌(టి)/జైనూర్‌/సిర్పూర్‌(యు), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని గురువారం వైభవంగా జరుపుకున్నారు. జిల్లాలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో దైవదర్శనాలు చేసుకున్నారు, మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఇళ్లను శోభాయమానంగా కళకళలాడాయి. షడ్రుచుల పచ్చడి, ఘుమఘుమలాడే పిండి వంటలతో కుటుంబ సభ్యులందరూ ఉగాది పండుగను సంబరంగా జరుపుకున్నారు. జిల్లాలోని ఆయా పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బంధువులు, స్నేహితులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని పచ్చడని అందించుకున్నారు. సాయంత్రం ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు.: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అలాగే జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో వేడుకలను జరుపుకున్నారు. బీసీ సంఘవం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఏర్పాటు చేసి ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమానికి పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్‌ హాజరై పంపిణీ చేశారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తనయుడు సాయినాథ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు వెంకన్న, అబ్దుల్లా, భారతి, స్వప్నరాణి, కార్తీక్‌, వినోద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ తదితరులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆలయాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కెరమెరి మండల కేంద్రంలోని శివాలయంలో వేధపండితుడు బాబురావు కులకర్ణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. గ్రామాల్లోని రైతులు తమ పంట చేనులో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రామకృష్ణ, గణేష్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పెంచికలపేట మండల కేంద్రంలోని రామాలయం, శివాలయం, హనుమాన్‌ ఆలయాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆలయాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్కపల్లి రామాలయంలో సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. వాంకిడి మండలంలో ప్రజలు ఘణ ంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో, ఇళ్ళల్లో ఉగాది పచ్చళ్లు చేసి ఈ ఏడాదంత మంచి జరగాలను కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జమాల్‌పూరి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చునార్‌కార్‌ సతీష్‌, స్థానిక నాయకులు జైరాం, విలాస్‌, శివాజీ, పెంటు పాల్గొన్నారు.బెజ్జూరు మండల కేంద్రంలోని రంగనాయక శివాలయం హనుమాన్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లో, గ్రామాల్లో వివిధ ఆలయాల్లో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయక ఆలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఎల్కపల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్‌ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని అందజేశారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. దహెగాం మండలంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులు గురువారం నుంచి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఎద్దులను అలంకరించుకొని అరకతో, గొడ్డలితో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. సాయంత్రం శివకేశవ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో శ్రీరామ చంద్రచార్య నరేంద్ర మహ రాజ్‌ శోభా యాత్రను నిర్వహించారు. బాలాజీ వేంకటేశ్వర ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వ హించారు. కార్యక్రమంలో శ్రీమాచంద్ర ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌, కార్యదర్శి కాళీదాస్‌ జిల్లాలోని పలు మండలాలు, మహారాష్ట్రకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై సురేష్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జైనూర్‌, మండలంలోని పచ్చని మామిడి ఆకులతో ఇళ్లను అలంకరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉగది పండుగను మరి కొందరు గుడి పాడవా అని కూడా పిలుస్తుండడం అనవాయితీగా వస్తోంది. ఉదయం ఆలయా లకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్లలో ఉగాది పచ్చడిని పంచారు. సిర్పూర్‌(యు), మండలంలో ఉగాది సందర్భంగా ఆలయల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఽ మండల కేంద్రంలోని మహదేవ్‌ ఆలయంతోపాటు హన్మున్‌, సాయిబాబా ఆలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ గ్రామాల్లో తమ సంప్రదాయం ప్రకారం ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పలువురు రైతులు వ్యవసాయ పనులను శ్రీకారం చుట్టారు.

Updated Date - Mar 19 , 2026 | 11:04 PM