రాహుల్ గాంధీతో మంత్రి వివేక్ భేటీ
ABN , Publish Date - May 17 , 2026 | 06:09 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. తెలంగాణలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు.
న్యూఢిల్లీ, మే 16(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. తెలంగాణలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా త్వరలో తెలంగాణలో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలంగా స్పందించారని వివేక్ తెలిపారు.