Share News

ఓటు చోరీ, పేపర్‌ లీకేజీలకు తండ్రి మోదీ

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:21 AM

దేశంలో నాటకీయ రాజకీయాలు, ఓటు చోరీ, పేపర్‌ లీకేజీ స్కాంలు, నోట్ల రద్దు వంటి వాటికి ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి లాంటి వారని కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎద్దేవా చేశారు.

ఓటు చోరీ, పేపర్‌ లీకేజీలకు తండ్రి మోదీ

  • కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో నాటకీయ రాజకీయాలు, ఓటు చోరీ, పేపర్‌ లీకేజీ స్కాంలు, నోట్ల రద్దు వంటి వాటికి ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి లాంటి వారని కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. ఆదివారం ‘ఫాదర్స్‌ డే’ను పురస్కరించుకుని మోదీపై వంశీకృష్ణ వ్యంగ్య విమర్శలు చేశారు. ‘‘నాటకీయ రాజకీయాలు, ‘మెలోడీ’ దౌత్యం, పెద్ద నోట్ల రద్దు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, నిరుద్యోగం, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానాలకు ప్రధాని మోదీ తండ్రి లాంటి వారు. ముఖ్యంగా ఫాదర్‌ ఆఫ్‌ అచ్చేదిన్‌ (మంచి రోజులకు తండ్రి లాంటి వారు). కానీ.. ఆయన పాలనలో ప్రస్తుతం దేశ పరిస్థితి దారుణంగా తయారైంది. అందుకే ఆయనిచ్చిన విఫల వాగ్దానాలు, దేశంలోని ప్రస్తుత పరిస్థితుల తరఫున మోదీకి ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు’ అంటూ వంశీకృష్ణ ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 22 , 2026 | 04:21 AM