Share News

వికారాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తా..

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:36 AM

వికారాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని, తనను గెలిపించిన 17వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కుమార్తె గడ్డం అనన్య అన్నారు.

వికారాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తా..

వికారాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని, తనను గెలిపించిన 17వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని కాంగ్రెస్‌ పార్టీ వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కుమార్తె గడ్డం అనన్య అన్నారు. శుక్రవారం ఫలితాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 17వ వార్డులో భారీ మేజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తనకు తండ్రి అయినా ప్రజాసేవలో తన ముద్ర వేసుకుంటానని, ఈ గెలుపుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 04:36 AM