గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:42 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో సోమవారం ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు గాయపడగా..
పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
15 ద్విచక్ర వాహనాలు దగ్ధం
రాయదుర్గం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో సోమవారం ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు గాయపడగా.. దట్టమైన పొగ వ్యాపించి అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పైఅంతస్తుల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. భవనం మొదటి అంతస్తులో ఉన్న 25 మంది ఇన్ఫోసిస్ సిబ్బందిలో పలువురు గాయపడగా, 13 మంది పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ప్యానల్ బోర్డులో షార్ట్‌సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.