Share News

kumaram bheem asifabad- నిప్పుల కొలిమి

ABN , Publish Date - Apr 30 , 2026 | 10:40 PM

భానుడు భగ్గుమంటున్నాడు. వేసవి తాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండంతో బయటకు రావడానికి జంకుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, సిర్పూర్‌(టి) మండలాల్లో గురువారం అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

kumaram bheem asifabad- నిప్పుల కొలిమి
లోగో

- వేసవి తాపానికి జనం విలవిల

- పెరిగిన వడగాల్పులు

- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): భానుడు భగ్గుమంటున్నాడు. వేసవి తాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండంతో బయటకు రావడానికి జంకుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, సిర్పూర్‌(టి) మండలాల్లో గురువారం అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌లో 44.7, కాగజ్‌నగర్‌లో 44.6, కాగజ్‌నగర్‌ మండలం జంబుగాలో 44.5, కౌటాలలో 44.4, సిర్పూర్‌(టి) మండలం వెంకట్‌రావుపేటలో44.3, తిర్యాణి, కెరమెరి మండలం ధనోరాలో 44.2, రెబ్బెన, రెబ్బెన మండలం వంకులంలో 44.1, దహెగాం, సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిర్యాణి మండలం గిన్నెధరలో 43.9, వాంకిడిలో 43.8, చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో 43.6, సిర్పూర్‌(యు)లో 43.5, బెజ్జూరులో 43.4, జైనూర్‌లో 43.3, దహెగాం మండలం కుంచవెల్లిలో 43.2, లింగాపూర్‌లో43.1, పెంచికలపేట మండలం ఎల్కపల్లిలో 43 డిగ్రీల ఉష్ణాగ్రతలు నమోదయ్యాయి.

ఎండ తీవ్రతకు..

ఎండ తీవ్రతకు పెరిగిన ఉక్క పోత, వేడికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం వేళలో జనం తమ పనుల కోసం బయటకు వెళ్తున్నారు. మే నెలలో ఎండల తీవ్రత మరింత ఎక్కువ య్యే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు అత్యవసర పని ఉంటే తప్ప, ప్రజలకు బయటకు రావడానికి ఇష్ట పడడం లేదు. భానుడి తాపానికి తోడు గాలిలో తేమ శాతం తగ్గుతుండడంతో వేడిగాలులు, తీవ్రమైన ఉక్క పోతలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఎండలు మండుతుం డడంతో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పనుల చేసుకుంటున్నారు. వేడి నుంచి బయట పడుటకు ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. కూలర్లు, ఏసీల ముందు కూర్చొని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

జాగ్రత్తలు ఇలా..

వేసవిలో లేత రంగులో ఉండే వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది.. నల్లని, ముదురు రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు తేలికపాటి ఆహారం మితంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవాలంటే బయటకు వెళ్లేటప్పుడు తలపై క్యాప్‌, తెల్లని వస్త్రాన్ని ధరించాలి. ఎండ వేడికి శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తాగకూడదు. అల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటికి బదులు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీర దోసకాయ, పండ్లు అధికంగా తీసుకోవాలి. చల్లటి వాతావ రణంలో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నించాలి. ఉష్ణోగ్రతలు తగ్గే వరకు చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. కాగా ఎవరైనా వడదెబ్బకు గురైనప్పుడు సరైన చికిత్స, చర్యలు తీసుకోకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి అధిక జ్వరం, తలనొప్పి, వాంతు లు, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకొవాడంలో ఇబ్బంది, మూర్చ, వికారం, చర్మం ఎర్రబడటం వంటి లక్ష ణాలు కనిపిస్తాయి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే ఆ వ్యక్తికి గాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ఇవ్వాలి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

Updated Date - Apr 30 , 2026 | 10:40 PM