Share News

kumaram bheem asifabad-నిప్పుల కొలిమి

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:18 PM

జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటివర కు గరిష్ఠంగా 44.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకు న్నాయి. ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.

kumaram bheem asifabad-నిప్పుల కొలిమి
లోగో

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటివర కు గరిష్ఠంగా 44.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకు న్నాయి. ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం నీటి కోసం తండ్లాడుతున్నాయి. బుధవారం జిల్లాలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.. వేడిమి పెరగడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

- పగటి ఉష్ణోగ్రతల్లో..

పదిహును రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద యం తొమ్మిది గంటల నుంచి ఎండ సురుక్కుమంటోంది. 11 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంట్లో ఉన్నా తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్‌ మాసంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెల లో పరిస్థితి ఎలా ఉండబోతోందనని జనం ఆందో ళన చెందుతున్నారు. కాగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రత గత వారం రోజులుగా 43 నుంచి 44. డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో నిప్పుల కొలిమిగా మారింది. జిల్లాలో ఈనెల 18న గరిష్ఠం గా రాష్ట్రంలోనే అత్యధికంగా 44.6 రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పదిహెను రోజుల నుంచి పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల సెల్సీయస్‌ నమోదవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదపుతోంది. సాయంత్రం ఐదు గంటల తరువాత కూడా వేడి తగ్గక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొం దేందుకు ప్రజలు శీతలపానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో శీతలపానియా విక్రయాలు ఊపందుకుంటున్నాయి. అలాగే కొబ్బరి బొండాలు విక్రయాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి.

- వేసవిలో ఎదురయ్యే సమస్యలు..

ఎండలో ఎక్కువగా తిరిగినా, పని చేసినా శరీరానికి తగినంత నీరందక ఖనిజాలు, లవణాలు లోపించి నిస్సత్తువ ఆవరిస్తుంది. దీంతో తీవ్రమైన అలసట కలుగుతుంది. ఒక్కో సారి కండరాలు కూడ పట్టేస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల కార ణంగా స్పృహ తప్పుతారు. ఎండలో తిరగడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి, సొమ్మసిల్లి పడిపోయే ప్రమాదముంది. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం తో అతిసార సోకే ప్రమాదముంది. విరేచనాలు, వాంతులు వస్తు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల డయేరియా సోకుతుంది. వేసవిలో వడదెబ్బతో ఎక్కువ మంది బాధపడుతుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు దీని బారిన పడే ప్రమాదముంది. వడదెబ్బ వల్ల కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు వడదెబ్బ సోకుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు చేరడంతో స్పృహతప్పుతుంది. ఒళ్లంతా పొడిబారినట్లు అవుతుంది. కొందరికి ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఎండలకు ప్రజలు తగిన జాగ్రత్త లు పాటించాల్సిన అవసరం ఉంది.

ఇవీ జాగ్రత్తలు..

- ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేయవద్దు. బయట తిరగడం, ఆటలు ఆడడం చేయకూడదు.

- తప్పని సరి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్తే తెల్లని రుమాలు ధరించాలి.

- తెలుపు రంగు ఉన్న పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి.

- నీటితో పాటు ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

- మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి.

- బయట నుంచి తిరిగి వచ్చిన వెంటనే నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్లుగానీ, చల్లని నీరు తాగాలి.

- తీపి పదార్థాలు, తేనె తీసుకోవద్దు.

- వేసవిలో నలుపు రంగు, మందంగా ఉండే దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు.

- చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.

- వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే గుర్తింపు పొందిన వైద్యులను వెంటనే సంప్రదించాలి.

వారం రోజుల్లో నమోదైన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు..

తేదీ గరిష్ఠ కనిష్ఠ

ఏప్రిల్‌-16 43.2 22.9

ఏప్రిల్‌-17 44.3 23.9

ఏప్రిల్‌-18 44.6 27.1

ఏప్రిల్‌-19 43.7 29.4

ఏప్రిల్‌-20 43.7 24.2

ఏప్రిల్‌-21 42.9 22.7

ఏప్రిల్‌-22 43.4 23.7

జాగ్రత్తలు పాటించాలి..

- డాక్టర్‌ సత్యనారాయణ, ఆసిఫాబాద్‌

వేసవి కాలంలో వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో అవసరమైతే తప్ప బయట తిరగొద్దు. శరీరక శ్రమతో కూడిన పనులు చేయవద్దు. డీహైడ్రేషన్‌కు గురవకుండా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి. కాటన్‌ దుస్తు లనే ధరించాలి. ఎండలో ప్రయాణించాల్సి వస్తే ముఖానికి రుమాలు కట్టుకోవాలి, టోపీలు, చలువ అద్దాలు, గొడుగు, హెల్మెట్‌ ధరించాలి. పంచదార, మజ్జిగ, నిమ్మరసం, ఉప్పుకలిపిన నీటిని తరుచూ తాగాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Apr 22 , 2026 | 11:18 PM