kumaram bheem asifabad-ఉగ్రభానుడు
ABN , Publish Date - May 02 , 2026 | 10:32 PM
భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం తొమ్మిది నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం నేలపై నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. రహదారులన్నీ జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు అగ్ని గోళాన్ని తలపిస్తోంది. ఐదు రోజులుగా ప్రచండ భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్క పోత, వడగాలులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఎండల తీవ్రతకు వన్యప్రాణులు, పశువులు సైతం అల్లాడి పోతున్నాయి.
- ఎండ వేడి, ఉక్కపోతకు ప్రజల అవస్థలు
ఆసిఫాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం తొమ్మిది నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం నేలపై నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. రహదారులన్నీ జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం వరకు అగ్ని గోళాన్ని తలపిస్తోంది. ఐదు రోజులుగా ప్రచండ భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్క పోత, వడగాలులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. ఎండల తీవ్రతకు వన్యప్రాణులు, పశువులు సైతం అల్లాడి పోతున్నాయి. ఐదు రోజులుగా జిల్లాలో 44 డిగ్రీలకు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో కొన్ని రోజులు ఇలాగే ఉంటుందని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. .జిల్లాలో వడదెబ్బతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. కాగజ్ నగర్ మండలంలోని కోయవాగు గ్రామానికి చెందిన హమాలి కార్మికుడు మేకర్తి పేంటయ్య (55), దహెగాం మండల కేంద్రానికి చెందిన కాటేల హన్మంతు (60) వడదెబ్బతో రెండు రోజుల క్రితం మృతి చెందారు.
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు..
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగు రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. శనివారం 44.7 డిగ్రీలకు వరకు చేరుకుంది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో శనివారం అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 దాక ఎండ ప్రతాపం చూపుతోంది. రాత్రి 8 గంటలు దాకా వడగాలుల ప్రభావం ఉంటోంది. అర్థరాత్రి వరకు వేడి గాలులు కొనసాగుతున్నాయి. వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఉన్న సామగ్రి సైతం ఎండ వేడికి భగ్గుమంటోంది. భానుడు ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు.వాహనదారులతో రద్దీగా ఉండే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు నిర్మాను ష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం రోడ్లపైకి రావాలంటే వాహనదారులు వెనకంజ వేస్తున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండవేళల్లో బయట తిరుగకూడదని, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు ఇలా ఉంటాయని చెబుతున్నారు.
జాగ్రత్తలు ఇలా..
వేసవిలో లేత రంగులో ఉండే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది.. నల్లని, ముదు రు రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు తేలికపాటి ఆహారం మితంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉష్ణోగ్రత్తల నుంచి రక్షించుకోవాలటే బయటకు వెళ్లేటప్పుడు తలపై క్యాప్, తెల్లని వస్త్రాన్ని ధరించాలి. ఎండ వేడికి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తాగకూడదు. అల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటికి బదులు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీర దోసకాయ, పండ్లు అధికంగా తీసుకోవాలి. చల్లటి వాతావ రణంలో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నించాలి. ఉష్ణోగ్రతలు తగ్గే వరకు చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిం చాలి.
- వడదెబ్బ లక్షణాలు..
వడదెబ్బకు గురైనప్పుడు సరైన చికిత్స, చర్యలు తీసుకొకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి అధిక జ్వరం, తలనొప్పి, వాంతు లు, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకొవాడంలో ఇబ్బంది, మూర్చ, వికారం, చర్మం ఎర్రబడటం వంటి లక్ష ణాలు కనిపిస్తాయి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంట నే ఆ వ్యక్తికి గాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ ఇవ్వాలి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.