Share News

kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:12 PM

ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని సమస్యలపై గళం విప్పారు. ‘అధ్యక్షా... అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడినా పట్టించుకోక పోతే ఎలా..? కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల ప్రజల కష్టాలు ఎవరు తీరుస్తారు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు’.

kumaram bheem asifabad- ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించాలి
అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని సమస్యలపై గళం విప్పారు. ‘అధ్యక్షా... అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడినా పట్టించుకోక పోతే ఎలా..? కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల ప్రజల కష్టాలు ఎవరు తీరుస్తారు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు’. నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, నిధుల కొరత, ప్రజలు పడుతున్న ఇబ్బందు లపై ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జిల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, గతంలో ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్చేవని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు. బిల్లులు రాక పోవడంతో నిధుల స్పష్టత లేక పోవడంతో కొత్త పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని వివరించారు. ఏజెన్సీ, గిరిజన గ్రామాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మంగి రోడ్‌, గుండాల రోడ్‌, మోడిగూడ వంటి ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అత్యవసర సమ యాల్లో ఆసుపత్రికి వెళ్లడం ప్రాణసంకటంగా మారిందన్నారు. మంత్రులు పర్యటిస్తూ చూసి వెళ్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అలాగే సీడీపీ పనులపై ప్రస్తావించారు.

Updated Date - Mar 18 , 2026 | 11:12 PM