Share News

మున్నూరుకాపు కార్పొరేషన్‌ భవనానికి నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:32 PM

మున్నూరుకాపు కార్పొరేషన్‌ భ వన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని టీపీసీసీ ఉపాఽధ్య క్షుడు జిల్లా కేంద్రానికి చెందిన చిట్ల సత్యనారాయణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కోరారు. శాసనసభలో సోమవారం ఆది శ్రీనివాస్‌తోపాటు ప్ర భుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన చిట్ల సత్యనారాయణ కార్పొ రేషన్‌ భవన నిర్మాణంతోపాటు మున్నూరుకాపు సమాజ అభివృద్ధికి తోడ్పా టునందించాలని విజ్ఞప్తి చేశారు.

మున్నూరుకాపు కార్పొరేషన్‌ భవనానికి   నిధులు కేటాయించాలి

మున్నూరుకాపు కార్పొరేషన్‌ భవనానికి

నిధులు కేటాయించాలి

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కలిసిన చిట్ల సత్యనారాయణ

మంచిర్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మున్నూరుకాపు కార్పొరేషన్‌ భ వన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని టీపీసీసీ ఉపాఽధ్య క్షుడు జిల్లా కేంద్రానికి చెందిన చిట్ల సత్యనారాయణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను కోరారు. శాసనసభలో సోమవారం ఆది శ్రీనివాస్‌తోపాటు ప్ర భుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన చిట్ల సత్యనారాయణ కార్పొ రేషన్‌ భవన నిర్మాణంతోపాటు మున్నూరుకాపు సమాజ అభివృద్ధికి తోడ్పా టునందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి న ఆది శ్రీనివాస్‌, వేం నరేందర్‌ రెడ్డిలు సీఎం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా జీ వో విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ తెలిపా రు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కూడా అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ విషయమై చర్చించి మున్నూరుకాపు అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు విప్‌ ఆది శ్రీనివాస్‌ను సత్యనారాయణ శాలువాతో ఘనంగా సత్కరించారు.

Updated Date - Jan 05 , 2026 | 11:32 PM