Share News

నడిగడ్డ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:34 PM

మండల పరిధిలోని నడిగడ్డ గ్రామానికి కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ నిధులు విడుదల చే శారు.

 నడిగడ్డ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు
కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ నుంచి చెక్కును అందుకుంటున్న సర్పంచు శశికళ

తెలకపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని నడిగడ్డ గ్రామానికి కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ నిధులు విడుదల చే శారు. నడిగడ్డ గ్రామం సమీపంలోని దుందుభీ నది ఇసుకను ప్రభుత్వ అనుమతితో వివిధ గ్రా మాలలో అభివృద్ధి పనులకు తరలిస్తున్నందున ప్రభుత్వం రూ.16,11,400 నిదులు మంజూరు చేసిందని కలెక్టర్‌ తెలిపారు. ఆ చెక్కును గురు వారం నడిగడ్డ సర్పంచ్‌ పలుస శశికళవామన్‌ గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి జోష్ణలకు కలెక్టర్‌ అందజేశారు. గ్రామ పంచాయతీ అకౌంట్‌కు జ మచేసి, గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Sep 03 , 2026 | 11:34 PM