Share News

విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:17 PM

:విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతుగా సం పూర్ణ సహకారం అందిస్తానని పెద్దపల్లి ఎం పీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జైపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. వి ద్యార్థులతో ముచ్చటించి వారి చదువులు, పాఠశాలలోని సౌకర్యాలు, సమస్యలను అడి గి తెలుసుకున్నారు.

విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం
జైపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీ వంశీకృష్ణ

-ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జైపూర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) :విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతుగా సం పూర్ణ సహకారం అందిస్తానని పెద్దపల్లి ఎం పీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. జైపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. వి ద్యార్థులతో ముచ్చటించి వారి చదువులు, పాఠశాలలోని సౌకర్యాలు, సమస్యలను అడి గి తెలుసుకున్నారు. విశాక చారిటబుల్‌ ట్ర స్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్‌ బ్యాగు లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యతో పాటు ఉపాధ్యాయుల కొరత ఉందని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాలలో సుమారు 340 మంది విద్యార్ధులు చదువుతున్నారని తెలుసుకుని ఎంపీ విద్యార్థుల సంఖ్యకు ను గుణంగా మౌలిక వసతులు, బోధన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చ దువుకుని ఉత్తమ మార్కులు సాధించాల న్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేందుకు కా కా గ్రోత్‌ ఫండ్‌ విడుదల చేయడం జరిగిం దన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, తహసీ ల్దార్‌ వనజారెడ్డి, ఎంపీడీవో శ్రీపతి బాపురా వు, సర్పంచు కూన భాస్కర్‌, డీసీసీ అద్యక్షు డు రఘునాధ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, అంబాల రవీందర్‌రెడ్డి, అంబాల సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సర్పం చులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:17 PM