Share News

kumaram bheem asifabad- రైతులపై ఇంధన భారం

ABN , Publish Date - May 19 , 2026 | 10:20 PM

రైతులపై ఇంధన భారం రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో రైతులు వరితో పాటు ఇతర పంటలనూ పండిస్తున్నారు. మారుతున్న కాలానికి అను గుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. దీనికి పల్లెల్లో కూలీల కొరత తీవ్రం గా వేధిస్తోంది. పొలం దున్నడం మొదలు...కోతల వరకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు.

kumaram bheem asifabad- రైతులపై ఇంధన భారం
లోగో

- దుక్కుల నుంచి కోతల వరకు యంత్రాలే

- భారంగా మారుతున్న ట్రాక్టర్‌ కిరాయిలు

- ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతల ఆందోళన

బెజ్జూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): రైతులపై ఇంధన భారం రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో రైతులు వరితో పాటు ఇతర పంటలనూ పండిస్తున్నారు. మారుతున్న కాలానికి అను గుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. దీనికి పల్లెల్లో కూలీల కొరత తీవ్రం గా వేధిస్తోంది. పొలం దున్నడం మొదలు...కోతల వరకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల డీజిల్‌ ధరలతో రైతులకు పెట్టుబడి భారంగా మారనుంది. గతేడాదితో పోలిస్తే డీజిల్‌ ధరలు రూ.5నుంచి 10వరకు పెరిగింది. ఈ ప్రభావం రైతులపై తీవ్రంగా పడనుంది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో డీజిల్‌ ధరలు పెరగడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం వ్యవసాయ పనులు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రైతులు పొలాలను దుక్కులు చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

- పత్తి, వరి సాగు..

జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, మరో 20వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పంటల సాగు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. జిల్లాలోని గ్రామాల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నాయి. వాటి యజమానులు సొంత వ్యవసాయ పనులు చేసుకున్న తర్వాత ఇతర రైతులకు అద్దె ప్రాతిపాదికన పనులు చేస్తుంటారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత లేదంటే పంట అమ్మిన తర్వాత ట్రాక్టర్‌ యజమానులకు కిరాయిలు చెల్లిస్తుంటారు. ప్రస్తుతం డీజిల్‌ ధరలు రూ.100కు చేరువలో ఉంది. పశ్చిమాసియా యుద్దం కారణంగా వాటి ధరలు మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు చేసే ట్రాక్టర్‌ యజమానులు సైతం నిర్వహణ ఖర్చులు పెరిగాయని అద్దెలు పెంచే పరిస్థితి నెలకొందని యజమానులు అంటున్నారు. గతేడాది దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.1800తీసుకోగా, ప్రస్తుతం రూ.2000కు పెంచినట్లు రైతులు పేర్కొంటున్నారు. అదే విధంగా దమ్ములు చేసేందుకు ఎకరానికి గతంలో రూ.1600ఉండగా, ప్రస్తుతం రూ.2000నుంచి 2200వరకు పెంచారు. ఇక వరి కోతలు, పత్తి సేధ్యాలు వంటి పనుల సమయంలో మరింత భారం పడనుంది. కూలీల కొరతతో గ్రామాల్లో వరి కోతలకు మిషన్‌లు వినియోగిస్తున్నారు. వరి కోతలకు మిషన్‌కు గంటకు రూ.2200ఉండగా, మిషన్ల డిమాండ్‌ను బట్టి రూ.3500నుంచి 4000వరకు తీసుకుంటున్నారు. డీజిల్‌ ధరలు పెరగడంతో వరి కోతలు, వరిగడ్డి కట్టే మిషన్‌ ధరలు సైతం భారంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత పెరిగే అవకాశం..

పశ్చిమాసియా యుద్ధంతో వివిద రకాల సామగ్రి ధరలు ఇప్పటికే పెరిగాయి. ఈ ప్రభావం పెట్రో, డీజిల్‌పై కూడా ప్రభావం ఏర్పడుతోంది. ఇప్పటికే లీటరుకు రూ.3వరకు పెంచగా, మరికొద్ది రోజుల్లో ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇందన కొరతతో వాహనాల సంఖ్యను తగ్గించాలని పిలుపునిచ్చారు. ఎక్కువగా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని సూచించడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు మోదీ బాటలో నడుస్తుండగా, ధరల పెరుగుదలకు ఇది సూచనలిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధాని మాటలనుబట్టి చూస్తే పెట్రో, డీజిల్‌ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అన్నదాతలకు ఏటా పెట్టుబడి భారంగా మారుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న ఇంధన ధరలతో అన్నదాతలకు దిగులు పట్టుకున్నది. ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు తడిసి మోపడువుతుండడంతో పెట్టుబడులు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఒకప్పుడు పల్లెల్లో ఇళ్ల ఎదుట కాడెద్దులు, పశువులు, వ్యవసాయ సామగ్రి కనిపించేవి. కాలక్రమేనా ఎడ్ల పోషణ భారంగా మారడం, కూలీలు దొరక్క పోవ డం, కూలీ రేట్లు ఎక్కువ కావడంతో సేద్యపు ఎడ్లు, పని ముట్ల స్థానాన్ని ట్రాక్టర్లు, యంత్రాలు ఆక్రమించాయి. ఇప్పుడు కాడెద్దులు కరువయ్యాయి. దుక్కిదున్నడం మొదలు పంట కోత వరకు, మందుల పిచికారి కోసం కూడా యంత్రాల పైనే ఆధారపడక తప్పడంలేదు. నిత్యం పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఇప్పుడు రైతులకు అదనపు భారంగా మారుతు న్నాయి. రైతులు పాత పద్ధతు ల్లో సాగు చేయలేక కొత్త పద్ధ తులు అందుకో లేక సతమతమతవుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు మరీ ఇబ్బందికరంగా ఉంది.

Updated Date - May 19 , 2026 | 10:20 PM