Share News

ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముంగిట

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:45 AM

ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో అక్కడ రెండు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు భద్రంగా ఉన్నాయని....

ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు ముంగిట

  • టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఫైళ్లకూ ఏమీ కాలేదు

  • ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) భవనం మొదటి అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో అక్కడ రెండు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు భద్రంగా ఉన్నాయని ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. కంప్యూటర్లలో ఉన్న ప్రతి కేసుకు బ్యాక్‌ఆప్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించిన ఆఽధారాలు నాశనమయ్యాయని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, రాజకీయంగానూ పలువురు నిరాధారమై న ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌లో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని, ప్రమాద ఘటనపై నాంపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో వివిధ కేసులకు సంబంధించిన చాలా మెటిరియల్స్‌ సురక్షితంగా ఉన్నాయని, ప్రమాదం తీవ్ర రూపం దాల్చకముందే సిబ్బంది జాగ్రత్త పడి విలువైన మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌ కాలిపోకుండా కాపాడారని చెప్పారు. 2015లో ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసు (క్రైం నంబరు 11)కు సంబంధించి తమకు ఆ ఏడాది 16 మెటిరియల్‌ అబ్జెక్ట్‌లు ఏసీబీ కోర్టు ద్వారా వచ్చాయని, వీటిని పరిశీలించి అదే ఏడాది నివేదికలను కోర్టుకు పంపించామని చెప్పారు. 2021లో 16 మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌ కోర్టుకు అందచేశామని వివరించారు. ఇక పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (క్రైం నంబర్‌ 243)కు సంబంధించి 2024 నుంచి గత నెల వరకు తమకు 136 మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌ వచ్చాయని వీటిలో 129 మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌కు సంబంధించిన నివేదికలు సంబంధిత అధికారులకు పంపించివేశామని, తమ వద్ద 7 మెటిరియల్‌ అబ్జెక్ట్స్‌ మాత్రమే గత నెలలో వచ్చిన వి ఉన్నాయని, వాటిని రిట్రీవ్‌ చేశామని ఆమె తెలిపా రు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు, మీడియా చేస్తు న్న ప్రచారాలు మరోలా ఉన్నాయని, దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఎక్కువ భాగం కేసులకు సంబంధించిన వివరాలు సురక్షితంగానే ఉన్నాయని ఆమె తెలిపారు.

Updated Date - Feb 09 , 2026 | 02:45 AM