Share News

kumaram bheem asifabad-ఇక ‘డిగ్రీ’లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:01 PM

ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫెషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు

kumaram bheem asifabad-ఇక ‘డిగ్రీ’లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల

-వాంకిడి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో చదువుతున్న విద్యార్థుల కు ఇక నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫెషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం) అమలు చేయ నున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీ దేవసేన ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మ కంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రారంభి స్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. టీజీ సీసీఈ అటెండెన్స్‌ యాప్‌ను ప్లే స్టోర్‌లో ఉంచామని, దాని వినియోగించుకు ని విద్యార్థుల వివరాలను నమోదు చేసి హాజరు తీసుకో వాలని ప్రిన్సి పాళ్లను ఆదేశించింది. జిల్లాలో వాంకిడి, కాగజ్‌నగర్‌లో డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ప్రతీ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో దాదాపు 1,500లకు పైగా ప్రవేశాలు పొందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రయోగా త్మకంగా ఎఫ్‌ఆర్‌ ఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అమలు చేయబో తున్నారు.

- తప్పనిసరిగా 75 శాతం హాజరు..

జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 50 శాతానికి మించి విద్యార్థులు కళాశాలలకు రావడంలేదని చెబుతు న్నారు. విద్యార్థులు కళాశాలలో చేరిన మొదటి మూడు నెలలు హాజరు శాతం ఎక్కువగా ఉంటుంది. మొదటి సెమిస్టర్‌ పూర్తి కాగానే విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గుతుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లేక పోవడం వల్ల విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. విద్యార్థులు లేక కొన్ని కళాశాలలో అఽధాపకులు ఖాళీగా ఉంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ మొదలైతే అధ్యాప కులకు కూడా బోధన చేయడానికి వీలు కలుగుతుంది. స్కాలర్‌షిప్‌ పొందుతున్న విద్యార్థులకు హాజరు తప్పని సరిగా 75శాతం ఉండాలి. ఇక నుంచి ఎప్‌ఆర్‌ఎస్‌లో 75 శాతం ఉన్న విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌ షిప్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 04 , 2026 | 11:01 PM