ఈ నెల 20 నుంచి తె.వ్య.కా.స. రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:04 PM
ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 20, 21, 22వ తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహి స్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు తెలిపారు.
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు
కొల్లాపూర్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 20, 21, 22వ తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహి స్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు తెలిపారు. కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ గెస్ట్ హౌస్‌లో వ్యవసాయ కార్మిక సంఘం కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ ఈనెల 20న మహాసభల మొదటి రోజు మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణి క్ సర్కార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ రాష్ట్ర కార్యదర్శి త మ్మినేని వీరభద్రం, వ్యవసాయ కా ర్మిక సంఘం జాతీయ అధ్యక్ష, కా ర్యదర్శులు విజయరాఘవన్, బీ వెంకట్ హాజరవుతారని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రజావ్యతి రేక విధానాలపై ప్రజలను, కార్మికులను, కూలీ లను సంఘటితం చేసి పెద్దఎత్తున ప్రజా ఉద్య మాలను సంఘటితం చేసి పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఆయన హెచ్చరిం చారు. కార్యక్రమంలో నాయకులు సీఐటీయూ జి ల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, కేవీపీఎస్ జిల్లా ఉ పాధ్యక్షుడు హనుమంత్, బత్తిని రాజు, సంజీవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కార్తీక్, ఆశా వర్కర్స్ జిల్లాకార్యదర్శి కళావతి, మత్స్యకార్మిక సం ఘం జిల్లా కన్వీనర్ శంకర్, ఆశా యూ నియన్ నాయకురాలు చెన్నమ్మ, శ్రీదేవి, మమ త, అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు హుస్సేనమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయ కులు శ్రీను, రాముడు, గ్రామ పంచాయతీ వర్క ర్స్ యూనియన్, నాయకులు బాలస్వామి, బాల రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.