kumaram bheem asifabad- ముగిసిన ప్రచార హోరు
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:29 PM
ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కార్మిక సంఘాలు పోటాపోటీగా నిర్వహించిన ప్రచారం గురువారం ముగిసింది. శుక్రవారం డిపో ఆవరణలో గుర్తింపు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆర్టీసీలో 2016లో ఎన్నికలు నిర్వహించారు. 2019లో కార్మిక సంఘాలను రద్దు చేస్తూ అప్పటి ప్రభుత్వం వెల్ఫెర్ బోర్డును ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హమీ మేరకు సెప్టెంబరు 18న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 295 మంది ఉన్నారు
- గెలుపుపై యూనియన్ల ధీమా
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కార్మిక సంఘాలు పోటాపోటీగా నిర్వహించిన ప్రచారం గురువారం ముగిసింది. శుక్రవారం డిపో ఆవరణలో గుర్తింపు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆర్టీసీలో 2016లో ఎన్నికలు నిర్వహించారు. 2019లో కార్మిక సంఘాలను రద్దు చేస్తూ అప్పటి ప్రభుత్వం వెల్ఫెర్ బోర్డును ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హమీ మేరకు సెప్టెంబరు 18న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 295 మంది ఉన్నారు. ఇందులో 251 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. శుక్రవారం నిర్వహించే ఎన్నికల్లో వీరు ఓటుహక్కును వినియోగించుకొనున్నారు. డ్యూటీలో ఉండి ఓటుహక్కు వినియోగించుకోని సిబ్బంది కోసం ఈనెల 14,15 తేదిలలో పోస్టల్ బ్యాలేట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. 17న పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో ప్రధానంగా రెండు సంఘాల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఏఐటీయూసీ మద్దతుతో ఎంప్లాయిస్ యూనియన్, ఐఎన్‌టీయూసీ మద్దతుతో టీడబ్ల్యుయూ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో డిపోలో రెండు కార్మిక సంఘాల మధ్యే ప్రధాన పోటి నెలకొంది. గత పది సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతుండటంతో గెలుపు కోసం రెండు సంఘాలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి.