Share News

అమరుల త్యాగ పలితంతోనే స్వాతంత్య్రం

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:33 PM

అమరులు చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. గురువారం మంచిర్యాల పట్ట ణంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.

అమరుల త్యాగ పలితంతోనే స్వాతంత్య్రం
మంచిర్యాలలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : అమరులు చేసిన త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. గురువారం మంచిర్యాల పట్ట ణంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మనం స్వేచ్ఛగా జీవిస్తున్నా మంటే దేశ సరిహద్దుల వద్ద నిరంతరం కాపలా కాస్తున్న సైనికుల వ ల్లనేనని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతీ ఒక్కరు ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు పురుషోత్తం, కొయ్యల ఏ మాజీ, దుర్గం అశోక్‌, గోలి రాము, వంగపల్లి వెంకటే శ్వర్‌రావు, ఎనగం దుల కృష్ణమూర్తి, పట్టి వెంకటకృష్ణ, అశోక్‌వర్ధన్‌, ప్రేమ్‌సింగ్‌, స్వప్నరాణి, సత్యనారాయణ, సంతోష్‌, మధు, రఘు నందన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:33 PM