kumaram bheem asifabad- అంగన్‌వాడీలకు ఉచిత విద్యుత్
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:18 PM
అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. సిర్పూర్(టి) ఐసీడీఎస్ పరిధిలో సిర్పూర్‘(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లో మొత్తం 202 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 130 సెంటర్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా మిగితా 72 కేంద్రాలకు విద్యుత్ లేదు.
సిర్పూర్(టి), మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. సిర్పూర్(టి) ఐసీడీఎస్ పరిధిలో సిర్పూర్‘(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లో మొత్తం 202 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 130 సెంటర్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా మిగితా 72 కేంద్రాలకు విద్యుత్ లేదు. దీంతో ప్రభుత్వం విద్యుత్ లేని సెంటర్లకు ఉచిత కనెక్షన్ ఇస్తున్నారు. చిన్నారుల అభ్యన్నతికి అంకితభావంతో పని చేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు కనెక్షన్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. పల్లల అభ్యాసానికి మెరుగైన వాతావరణం కల్పించాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యం అందు బాటులోకి రావడంతో కేంద్రాల్లో ఫ్యాన్‌లు, లైట్లు, తాగునీటి వాటర్ ఫిల్టర్లు, మోటార్లు పని చేయడంతో పాటు చిన్నారులకు ఉక్క పోత నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందనుంది. ఈ క్రమంలో ఇటీవల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు స్వచ్ఛ భారత్ స్కీం కింద మరుగుదొడ్లు సైతం మంజూరు అ య్యాయి. ఒకటి రెండు కేంద్రాల్లో వీటి నిర్మా ణ పనులు ఎన్‌ఆర్ ఈజీఎస్ నిధుల కింద ప్రారంభమైనట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. కాగా సిర్పూర్(టి) ఐసీడీఎస్ పరిధిలో పలు అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టడం లేదు. దీంతో అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. ఇప్ప టికైనా సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేని వాటికి కూడా మంజూరు చే యాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నాం..
- జగన్మోహన్, ఏఈ
సిర్పూర్(టి) ఐసీడీఎస్ పరిధిలో అంగన్ వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేని సెంటర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తు న్నాం. ఇప్పటికే మండలంలో పలు కేంద్రాల కు పనులు ప్రారంభించాం. త్వరలోనే అన్ని కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.