Share News

kumaram bheem asifabad- పెట్టుబడుల పేరుతో మోసం

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:09 PM

తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన కేసులో ఒకరిని అరెస్టు చేశామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. కాగజ్‌నగర్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రూ 2 కోట్ల భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలైన థాకూర్‌ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

kumaram bheem asifabad-  పెట్టుబడుల పేరుతో మోసం
మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

- వివరాలు వెల్లడించిన ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన కేసులో ఒకరిని అరెస్టు చేశామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. కాగజ్‌నగర్‌ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన రూ 2 కోట్ల భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలైన థాకూర్‌ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. డివైన్‌ గ్రూపు ఆఫ్‌ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తు ప్రజలను పెట్టుబడులు పెట్టమని కోరిందని చెప్పారు. అధిక లాబాలు వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి సుమారు రూ. 2 కోట్ల మొత్తంలో నగదు వసూలు చేశారని వెల్లడించారు. ఐదు నుంచి 20 శాతం వరకు లాబాలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. కాగజ్‌నగర్‌, పెంచికలపేట, హైదరాబాద్‌ ప్రాంతాలలో, 2021 నుంచి 2023 మధ్య కాలంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో నివసిస్తూ ప్రజలను నమ్మబలికి డబ్బులు తీసుకొని పరారయ్యారని చెప్పారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారని చెప్పారు. ఇందులో థాకూరు శివరంజనిబాయిని అరెస్టు చేశామని చెప్పారు. మిగిలిన నిందితులు థాకూర్‌ కరణ్‌సింగ్‌, థాకూర్‌ రతన్‌సింగ్‌, థాకూర్‌ రవీందర్‌, థాకూర్‌ రాణాసింగ్‌లు పరారీలో ఉన్నారని వివరించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితురాలని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రేంకుమార్‌, ఎస్సై రాజు, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మి, జ్యోత్స్న, బ్లేస్సీ, షమీనా, కానిస్టేబుల్‌ విజయ్‌ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 25 , 2026 | 11:09 PM