Minister Damodar Rajanarsimha: ఈ ఏడాది 4 కొత్త ఆస్పత్రులు ప్రారంభం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:36 AM
కొత్తసంవత్సరంలో నాలుగు కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని..
వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కొత్తసంవత్సరంలో నాలుగు కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. గుండె, కిడ్నీ జబ్బులు, కేన్సర్ వంటి మొండి వ్యాధులకు సైతం పేదలు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బోధనాస్పత్రుల్లో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. 2026లో రాష్ట్ర వ్యాప్తంగా వందకుపైగా క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ట్రామా కేర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.