Share News

నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:04 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నా లుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి
కల్వకుర్తిలో మాట్లాడుతున్న ఆర్‌.వెంకట్రాములు

- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు

కల్వకుర్తి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నా లుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మి క సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ఖండిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మిక, క ర్షక పోరు యాత్ర శనివారం కల్వకుర్తికి చేరు కుంది. పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరు గారుస్తూ దాని స్థానంలో వీబీజీరాంజీ పథకం తీసుకొచ్చి వంద రోజుల పనికి వ్యవసాయ కా ర్మికులను దూరం చేసే చర్య చేపట్టిందని ఆరో పించారు. ఈ నెల 19న నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ యన కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బి. ఆంజనేయులు, పి.నరసింహ, సి.ఆంజనేయు లు, మాసమ్మ, బి.శ్రీనివాసులు, ఆంజనే యులు, వెంకటేశ్‌, శ్రీనివాసులు, లక్పతి, శివలీల, మెర్లిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:04 PM