కవితవర్గం కాదు.. సొంతంగా గెలిచాం
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:49 AM
జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు ఎనిమిది వార్డులలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎ్‌ఫబీ) అభ్యర్థులే విజయం సాధించారు.
గద్వాల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు ఎనిమిది వార్డులలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎ్‌ఫబీ) అభ్యర్థులే విజయం సాధించారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత తమ అభ్యర్థులను ఏఐఎ్‌ఫబీ తరఫున బరిలోకి దింపి వడ్డేపల్లి మున్సిపాలిటీ ని సొంతం చేసుకున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలో వడ్డేపల్లి ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాసులు దీనిపై మీడియాతో మాట్లాడారు. తాము కల్వకుంట్ల కవిత వర్గంకాదని, ఆమె తమ తరఫున ప్రచారం చేయలేదని ప్రకటించారు. తాము ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్‌ల కోసం వెళ్లినప్పుడు కవిత అక్కడ ఉన్నారని, దానితో ఆమెను కలిశామని తెలిపారు. అంతేతప్ప ఆమెతో తమ విజయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలకు తాము అన్ని విధాలుగా అండగా ఉండటంతోనే గెలిపించారని చెప్పారు.