Share News

kumaram bheem asifabad- బలవర్ధక బియ్యం మాయం

ABN , Publish Date - Oct 30 , 2026 | 10:47 PM

పేదలకు పోషకాహార బియ్యం(ఫోర్టిపైడ్‌) అందడం లేదు. ఏడాది కాలంగా సన్నబియ్యం పంపిణీ పేరిట అధికారులు ఈ బియ్యం పంపిణీని నిలిపివేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. పేద, మధ్యతరగతి ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2023ఏప్రిల్‌లో బలవర్ధక బియ్యం పంపిణీ ప్రారంభించింది. రేషన్‌ కార్డుల ద్వారా పేదలకు కొంతకాలం బబాగానే అందించినా సంవత్సర కాలంగా సన్నబియ్యం ఇస్తున్నామనే కారణంతో ఫోర్టిపైడ్‌ బియ్యం పంపిణీని నిలిపివేశారు.

kumaram bheem asifabad- బలవర్ధక బియ్యం మాయం
లోగో

బెజ్జూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు పోషకాహార బియ్యం(ఫోర్టిపైడ్‌) అందడం లేదు. ఏడాది కాలంగా సన్నబియ్యం పంపిణీ పేరిట అధికారులు ఈ బియ్యం పంపిణీని నిలిపివేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. పేద, మధ్యతరగతి ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2023ఏప్రిల్‌లో బలవర్ధక బియ్యం పంపిణీ ప్రారంభించింది. రేషన్‌ కార్డుల ద్వారా పేదలకు కొంతకాలం బబాగానే అందించినా సంవత్సర కాలంగా సన్నబియ్యం ఇస్తున్నామనే కారణంతో ఫోర్టిపైడ్‌ బియ్యం పంపిణీని నిలిపివేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఫోర్టిపైడ్‌ రైస్‌ పంపిణీ చేస్తుండగా, రేషన్‌ కార్డుల ద్వారా పేదలకు మాత్రం నిలిపి వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- సాధారణ బియ్యానికి..

ఫోర్టిపైడ్‌ రైస్‌ అంటే సాధారణ బియ్యానికి పోషక విలువలను కృత్రిమంగా శాస్ర్తీయ పద్ధతిలో జోడించి తయారు చేసిన బియ్యం. ప్రభుత్వానికి రైస్‌ మిల్లర్లు ఇచ్చే లేవీ బియ్యం ప్యాకింగ్‌ సమయంలో శాస్ర్తీయ పద్ధతిలో సాధారణ బియ్యాన్ని పిండిగా చేసి అందులో పుడ్‌సేప్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సిఫార్సు చేసిన గోదుమలు, మినుములు, పెసర, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మార్చి వాటిని బియ్యం పరిమాణంలో గింజలుగా తయారు చేసి బియ్యంలో కలుపుతారు. ఫోర్టిపైడ్‌ రైస్‌లో ఐరన్‌, విటమిన్‌ డి, బి-12తో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, జింక్‌, విటమిన్‌ ఏ, మిలితమై ఉంటాయి. ఐరన్‌తో రక్తహీనతను నివారిస్తుంది. గర్బిణుల్లో పోషకాహార లోపాన్ని, పిల్లల్లో వివిద లోపాలను నివారించగలదు.

- రైస్‌ మిల్లుల్లోనే లోపం..

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం మిల్లులకు ప్రభుత్వం ఇస్తుంది. రైస్‌ మిల్లుల్లో ధాన్యాన్ని మేలురకం బియ్యంగా మార్చి ఆ బియ్యంలో ఒక క్వింటాకు కిలో ఫోర్టిపైడ్‌ గింజలను కలిపి అవి పూర్తిస్థాయిలో బియ్యంలో కలిసేలా చేయాలి. అయితే ఇక్కడే మోసం జరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన రైస్‌ మిల్లుల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చిన తర్వాత ఫోర్టిపైడ్‌ రైస్‌ కలిపే విషయంలో అధికారుల పర్యవేక్షణ ఉండటం లేదు. ఒకవేళ తెలిసినా చూసి చూడనట్లుగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఫోర్టిపైడ్‌ రైస్‌ ఇవ్వడం లేదనే సాకుతో మిల్లర్లు కలపకుండానే బియ్యం ఇస్తున్నారు. ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకొని అధికారులు అదే పేరుతో ఫోర్టిపైడ్‌ రైస్‌ లేని బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారిస్తున్నారు. కాగా గత ఆగస్టు నెలలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేశారు. వచ్చే నవంబరు 1నుంచి మళ్లీ పేదలకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సారి కూడా పోషకాహారం లేని సాధారణ బియ్యమే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. పేదలకు పోషకాలు లేని బియ్యం పంపిణీపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి పోషకాహార బియ్యాన్ని అందించేలా చూడాలని పేద ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 10:47 PM