జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి
ABN , Publish Date - May 20 , 2026 | 03:24 AM
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్న డిమాండ్‌తో జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించనున్నట్లు మాజీ సర్పంచుల ...
పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలి
మాజీ సర్పంచుల సంఘం డిమాండ్
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్న డిమాండ్‌తో జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించనున్నట్లు మాజీ సర్పంచుల సంఘం ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బిల్లులు చెల్లించాలని మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ప్రజా భవన్‌లో 11సార్లు వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్యను పరిష్కరించలేదని మాజీ సర్పంచులు సుర్వి యాదయ్యగౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి, రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచుల పదవీకాలం పూర్తయి 32 నెలలైనా.. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు.