Share News

మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:22 AM

మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకొని నెట్టివేసినందుకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రాజుగౌడ్‌...

మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ కేసు

  • అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి భారీగా పోలీసులు

తాండూరు/నార్సింగ్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకొని నెట్టివేసినందుకు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రాజుగౌడ్‌, పట్లోళ్ల నర్సింహులు తదితర 9 మందిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు తాండూరు, వికారాబాద్‌ నుంచి 50 మంది పోలీసులు.. హైదరాబాద్‌ మణికొండలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, రోహిత్‌రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే రోహిత్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

Updated Date - Feb 16 , 2026 | 02:22 AM