Share News

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ పిలుపు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:44 AM

ఈనెల 25న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాలని రాష్ట్రంలోని పలువురు మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ...

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ పిలుపు

  • 25న విచారణకు హజరుకావాలని నోటీసులు

వరంగల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈనెల 25న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాలని రాష్ట్రంలోని పలువురు మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్‌ విఠల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న పలువురు మాజీ మావోయిస్టులకు ఈ నోటీసులు పంపింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టులకు ఈ నోటీసులు వెళ్లినట్లు సమాచారం. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సమాచారాన్ని సేకరించేందుకు ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఒకవేళ తమ సమీప ప్రాంతంలోని కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని కోరుకుంటే లిఖితపూర్వకంగా ఈనెల 15వ తేదీ లోపు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.

Updated Date - Mar 14 , 2026 | 05:44 AM