Share News

విప్లవోద్యమం అంతం కాలేదు

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:34 AM

విప్లవోద్యమం అంతం కాలేదని.. సమాజంలో దోపిడీ, పీడన, అసమానతలు ఉన్నంతకాలం మావోయిజం, లెనినిజం ఉంటుందని మావోయిస్టు...

విప్లవోద్యమం అంతం కాలేదు

  • మావోయిస్టు మాజీ నేత బండి ప్రకాశ్‌

మందమర్రిటౌన్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): విప్లవోద్యమం అంతం కాలేదని.. సమాజంలో దోపిడీ, పీడన, అసమానతలు ఉన్నంతకాలం మావోయిజం, లెనినిజం ఉంటుందని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య మాజీ కార్యదర్శి బండి ప్రకాశ్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో బండి ప్రకాశ్‌ మిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం బండి ప్రకాశ్‌ దంపతులు, మాజీ మావోయిస్టు అప్పాచి నారాయణ దంపతులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సం దర్భంగా ప్రకాశ్‌ మాట్లాడారు. అనారోగ్యంతో పార్టీకి భారం కాకూడదనే ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన అవకాశంతోనే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని అప్పాచి నారాయణ అన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:34 AM