గ్రామ స్వరాజ్య మార్గదర్శి కూసం రాజమౌళి కన్నుమూత
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:10 AM
జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి(75) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 2006 నుంచి 2011 వరకు ఆయన గంగదేవిపల్లి...
గీసుగొండ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి(75) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన 2006 నుంచి 2011 వరకు ఆయన గంగదేవిపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గ్రామంలో 11 కమిటీలను ఏర్పాటు చేసి గ్రామస్థులను భాగస్వాములను చేశారు. బాలవికాస సంస్థ సహకారం గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేశారు. 2016లో నాటి సీఎం గంగదేవిపల్లికి వచ్చి గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించి గ్రామాభివృద్ధ్దికి రూ.10 కోట్లు విడుదల చేశారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ గంగదేవిపల్లి అభివృద్ధి గురించి మాట్లాడుతూ రాజమౌళిని అభినందించారు. గ్రామ పరిపాలన, ప్రజల భాగస్వామ్యంపై శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. నాటి రాష్ట్రపతి కలాం, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాజమౌళి ఉత్తమ సర్పంచ్ అవార్డులను అందుకున్నారు.