సలహాదారుగా శివధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - May 07 , 2026 | 04:37 AM
తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమితులైన మాజీ డీజీపీ బి.శివధర్‌రెడ్డి బుధవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ ..
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమితులైన మాజీ డీజీపీ బి.శివధర్‌రెడ్డి బుధవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బాధ్యతలు స్వీకరించారు.పోలీసింగ్, లా అండ్ ఆర్డర్, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాద క ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రతకు సంబంధించి భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి వ్యవహరించ నున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎ్‌సడీ కమలాసన్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే ఆయనకు కార్యాలయాన్ని కేటాయించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన తర్వాత శివధర్ రెడ్డి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.