Share News

చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:42 PM

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం క్యాతనపల్లిలోని సుమన్‌ ఇంటికి చేరుకున్న పోలీసులను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌
బాల్కసుమన్‌ అరెస్టును అడ్డుకుంటున్న కార్యకర్తలు

ఉద్రిక్తంగా మారిన ఆర్‌కేపీ బంద్‌ పిలుపు

19 మంది బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులపై కేసులు నమోదు

రామకృష్ణాపూర్‌, ఫిబ్రవరి18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం క్యాతనపల్లిలోని సుమన్‌ ఇంటికి చేరుకున్న పోలీసులను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను నిలువరిస్తూనే సుమన్‌ నివాసంలోకి వెళ్లిన పోలీసులు అయనను అరెస్ట్‌ చేసి వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్‌, ఎంపీ వంశీ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు బాల్క సుమన్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్‌ నరేశ్‌ కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెద్ద సంఖ్యలో సుమన్‌ ఇంటిని చుట్టుముట్టారు. కాసేపటికి ఆయనను అరెస్ట్‌ చేసి మంచిర్యాల కోర్టుకు తరలించారు. మంచిర్యాల ఫస్ట్‌ క్లాస్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం సుమన్‌ను ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టి గురువారం మంచిర్యాల జిల్లా బందుకు పిలుపునిచ్చారు.

ఉద్రిక్తంగా మారిన బంద్‌ పిలుపు

కాంగ్రెస్‌ నాయకులు దాడులకు నిరసనగా బీఆర్‌ఎస్‌, సీపీఐ సంయుక్తంగా ఇచ్చిన రామకృష్ణాపూర్‌ బందు పిలుపు బుధవారం ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం నుంచే పోలీసులు ఒక్కొక్కరిగా బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 19 మందిని అరెస్టు చేస్తున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూని చేస్తుంది....

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

మంత్రి వివేక్‌, ఎంపీ వంశీక్రిష్ణ రాజ్యాంగాన్ని కూని చేస్తూ పోలీసుల సహకారంతో బీఆర్‌ ఎస్‌, సీపీఐ నాయకులపైనే దాడులు చేయడం చూ స్తూ పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఉండడం రా జ్యాంగ విరుద్దమేనని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులను పథ కం ప్రకారమే అరెస్టు చేశారని ముందస్తు నోటీ సులు అందించకుండా పోలీసులు అరెస్టు చేయ డం సరికాదన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటి చె ౖర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఎన్నుకునేందుకు పూర్తి స్థాయి కోరం సభ్యులు బీఆర్‌ఎస్‌కు ఉన్నా మంత్రి కన్నుసన్నల్లోనే ప్రత్యేకాధికారితోపాటు పోలీసులు నడుచుకున్నారని కాంగ్రెస్‌ దౌర్జన్యపాలన మరొ క్కసారి తేటతెల్లమైందన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:42 PM