బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:10 AM
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నియమావళికి విరుద్ధంగా ఆందోళనలు నిర్వహించారంటూ బాల్క సుమన్ ....
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నియమావళికి విరుద్ధంగా ఆందోళనలు నిర్వహించారంటూ బాల్క సుమన్ ఇతర బీఆర్‌ఎస్ నాయకులపై నమోదైన కేసు ను హైకోర్టు కొట్టేసింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్ తదితరులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడంతో పాటు, ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ధర్నా, ఆందోళనలు చేశారని చెన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని కొట్టేయాలని సుమన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నూరు మండల వ్యవసాయాఽధికారి బాల్క సుమన్ తదితరులపై ఫిర్యాదు చేశారని.. ఇందుకు ఆయన క్యాడర్ సరిపోదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు క్వాష్ పిటిషన్‌ను అనుమతిస్తూ సుమన్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది.