అడవులు జీవరాశులకు ఆవాసాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:38 PM
వన్యప్రాణు ల సంరక్షణ ప్రతీ పౌరుడి సా మాజిక బాధ్యత అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హన్మంత్ నాయక్ అన్నారు.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హన్మంత్ నాయక్
అచ్చంపేటటౌన్ నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వన్యప్రాణు ల సంరక్షణ ప్రతీ పౌరుడి సా మాజిక బాధ్యత అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హన్మంత్ నాయక్ అన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భా గంగా అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మం గళవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ శాలల్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. అడవులు కేవ లం చెట్ల సమూహాలు మాత్రమే కాదని అనేక జీవరాశులకు ఆవాసాలని అన్నారు. భూమిపై పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పులులు, చిరుతలు, జింకలు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణుల ప్రాముఖ్యతను వివరించారు. అడవుల్లో అక్రమ ప్రవేశాలు, వేట, అటవీ అగ్ని ప్రమాదాలు, ప్లాస్టిక్ కాలుష్యం వంటి సమస్యల వల్ల జీవవై విధ్యానికి కలుగుతున్న నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.