Share News

kumaram bheem asifabad- అటవీ ఉత్పత్తులే ఆదాయ వనరు

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:46 PM

అటవీ ఉత్ప త్తుల సేకరణతో అడవి బిడ్డలు ఉపాధి పొందుతు న్నారు. అడవులనే నమ్ముకుని అడవే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీలు తమ సంప్రదాయ అటవీ ఉత్పత్తులను మరవడం లేదు. అడవి తల్లి ఏదో ఒక రూపంలో వారికి ఆసరా కలిగిస్తోంది. ఇప్పపూలు, జీడి గింజలు, తునికాకు, తునికి పండ్లు, మొర్రిపండ్లు, పాల పలుకులు అందిస్తూ వారిని కొంత ఆర్థికంగా బలపడేలా చేస్తోంది.

kumaram bheem asifabad- అటవీ ఉత్పత్తులే ఆదాయ వనరు
లోగో

- ఉపాధి పొందుతున్న ఆదివాసీలు

కెరమెరి ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్ప త్తుల సేకరణతో అడవి బిడ్డలు ఉపాధి పొందుతు న్నారు. అడవులనే నమ్ముకుని అడవే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీలు తమ సంప్రదాయ అటవీ ఉత్పత్తులను మరవడం లేదు. అడవి తల్లి ఏదో ఒక రూపంలో వారికి ఆసరా కలిగిస్తోంది. ఇప్పపూలు, జీడి గింజలు, తునికాకు, తునికి పండ్లు, మొర్రిపండ్లు, పాల పలుకులు అందిస్తూ వారిని కొంత ఆర్థికంగా బలపడేలా చేస్తోంది. వాటిని సేకరించేందుకు ఆదివాసీలు వేకువజామునే నిద్ర లేచి పిల్లా పాప లతో కలిసి అడవి బాట పడుతున్నారు. జిల్లాలోని కెరమెరి, జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, తిర్యాణి, వాంకిడి, సిర్పూర్‌(టి), పెంచికలపేట, బెజ్జూ రు అడవుల్లో అటవీ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ముఖ్యంగా కెరమెరి మండలంలో అధికంగా అడవులు ఉండడం వల్ల సాకడ, సాంగ్వీ, కొప్పగూడ, పిట్టగూడ, కేలి(కె), లెండిగూడ, మెట్ట పిప్పిరి, మోడి, చాల్‌బాడి, జోడేఘాట్‌, పాట్నాపూర్‌ తదితర గ్రామా ల ఆదివాసీలు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఇప్పపూలు, జీడి గింజలు సేకరించడంలో నిగమ్నమవుతున్నారు. మరి కొద్ది రోజుల్లో తునికాకు సేకరణ కూడా ప్రారంభం కానుంది.

- వేసవిలో ఆసరాగా..

వ్యవసాయ పనులు లేని సమయంలో వేసవిలో అటవీ ఉత్పత్తులు ఆదివాసీలు పొట్టపోసుకునేం దుకు ఆసరాగా మారుతున్నాయి. వేసవి కాలలో అడవిలో లభించే పండ్లలో జీడి పండు ఒకటి. ప్రస్తు తం ఆదివాసీ మహి ళలు ఉదయం నుంచి సాయం త్రం వరకు అడవిలో జీడిపండ్లు సేకరణలో తలమునకలయ్యారు. చెట్లు చవరన కొమ్ములపై జీడి గింజ, దానిక ఆనుకుని ఉన్న కాయ కాసిన కొద్ది రోజులకు పసుపు రంగులోకి పండుగా మారుతుంది. వాటిని వెదురు కంకతో తెంపుతారు. నల్లగా ఉన్న గింజల నుంచి జాగ్రత్తగా పండును తుంచి ఆరబెట్టి తింటారు. అప్పటికప్పుడు ఇనాలంటే నిప్పుల్లో కాల్చి చల్లార్చిన తరువాత తింటే ఎంత రుచిగా ఉంటుంది. నల్లగా ఏర్పడిన జీడిని మార్కెట్‌లో విక్రయిస్తారు. జీడి గింజలు కిలో రూ.30కి మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు.

- ఆర్థికంగా వెసులుబాటు..

వేసవి కాలంలో వచ్చిందంటే గిరిజనులకు పండు గే. ఈ కాలంలో ఇప్పపూలు విరివిగా లభి స్తాయి. వేకువజామునే అడవికి వెళ్లిన ఆదివాసులు ప్పపూల చెట్టుకింద గంటల తరబడి కూర్చుని వాటిని బుట్టలో ఏరుతారు. అనంతరం పనులను ఇంటికి తీసుకు వచ్చి ఎండలో ఆరబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తారు. ప్రస్తుతం అత్యధిక గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా ఇప్పపూలు ఆరబెట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కొందరు వీటిని విక్రయించి ఆర్థికంగా లాభపడు తుంటే, మరికొందరు వంట చేసుకుని ఆరగిస్తారు. కానీ ఇంత కష్ట పడి సేకరించిన ఇప్పపూలకు మార్కె ట్‌లో మాత్రం ఆశించినంత డిమాండ్‌ లేదు. జీసీసీ ఆధ్వర్యంలో గతంలో కిలోకు రూ.20 చొప్పున కొను గోలు చేశారు. ఈ ఏడాది కిలోకు రూ.30 చొప్పున విక్రయిస్తున్నామని చెబుతున్నారు. ఎంతో కష్ట పడి సేకరించిన ఇప్పపూలకు ఆశించిన ధర లేక పోవడం పై ఆదివాసీలు అసంతృప్తితో ఉన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 10:46 PM