kumaram bheem asifabad- అటవీ సంరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:28 PM
అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని డిప్యూటీ రేంజ్ అధికారి అస్మా అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎల్లూరు, ఆగర్‌గూడ, లోడ్పల్లి గ్రామాల్లో కళాజాతా బృందం ఆధ్వర్యంలో మంగళవారం అటవీ సంరక్షణ, అటవీ జంతువులవేట, అడవిలో సంభవించే నిప్పు నివారణ చర్యలు వంటి పలు అంశాల మీద అవగాహన కల్పించారు.
పెంచికలపేట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని డిప్యూటీ రేంజ్ అధికారి అస్మా అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎల్లూరు, ఆగర్‌గూడ, లోడ్పల్లి గ్రామాల్లో కళాజాతా బృందం ఆధ్వర్యంలో మంగళవారం అటవీ సంరక్షణ, అటవీ జంతువులవేట, అడవిలో సంభవించే నిప్పు నివారణ చర్యలు వంటి పలు అంశాల మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోయచిచ్చాల నుంచి ఆగర్‌గూడ వెళ్లే కరెంటు తీగల వద్ద వేటగాళ్ల ఉచ్చులో అనేక జంతువులు మరణిస్తున్నాయని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం గ్రామ సభ నిర్వహించి విద్యుత్ తీగలను రోడ్డు పక్క నుంచి మార్చడం కోసం గ్రామ సభ నిర్వహించి ఆమోదం పొందే విధంగా కృషి చేస్తామని సర్పంచ్ రవీందర్ హామీు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి, ప్రజలు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
సిర్పూర్(టి), మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దబండ అటవీ ప్రాంతం లోని భీమన్న గుడి వద్ద ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎఫ్‌డీవో అప్పయ్య ఆధ్వర్యంలో అటవీ అధికారులు ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు. భక్తులు గుడి పరిసరాల్లో అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థపదార్థాలు పారవేసి పరిసరాలు అపరిశు భ్రం చేయకుండా తిరిగి వెళ్లేటప్పుడు తమ వెంట తీసుకెళ్లి డంప్ యార్డులో వేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో వంట చేసుకుని వారు నిప్పును అలాగే వదిలి వేయడం వల్ల అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాటిని పూర్తిగా ఆర్పివేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో ప్రవీణ్‌కుమార్, డీఆర్వో శశిధర్ బాబు, సెక్షన్ ఆఫీసర్ అక్తర్, ఎఫ్‌బీవోలు మల్లికార్జున్, అరవింద్, హబీబ్, రవీనా, సంతోష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
చింతలమానేపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండల కేంద్రంలో ని కేజీబీవీ పాఠశాలలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కర్జెల్లి రేంజ్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమ్మ గుట్ట, భీమన్నదేవాలయం, శివపల్లి శివాలయం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో సుభాష్, ఎఫ్‌ఎస్‌ఓ శ్రీనివాస్, ఎఫ్‌బీఓలు ప్రభాకర్, దినేష్, మురళీ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.