Share News

సతుల కోసం... పతుల పాట్లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:03 AM

గతంలో భర్తలు ఎన్నికల్లో పోటి చేస్తుంటే వారి భార్యలు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించేవారు. బరిలో ఉన్న తమ భర్తల కోసం ఎన్నికల ప్రచారంలో మునిగితేలేవారు. ప్రస్తుతం రిజర్వేషన్ల పుణ్యమా అని మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటా యించారు.

సతుల కోసం... పతుల పాట్లు

పురపీఠం కోసం ముమ్మర యత్నాలు

రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో భార్యలను బరిలో నిలిపిన భర్తలు

బెల్లంపల్లి, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): గతంలో భర్తలు ఎన్నికల్లో పోటి చేస్తుంటే వారి భార్యలు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించేవారు. బరిలో ఉన్న తమ భర్తల కోసం ఎన్నికల ప్రచారంలో మునిగితేలేవారు. ప్రస్తుతం రిజర్వేషన్ల పుణ్యమా అని మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటా యించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేస్తున్న నాయకులు రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో చేసేదేమిలేక వారి సతులను ఎన్నికల బరిలో ఉంచారు. దీంతో భార్యలు పోటి చేస్తుంటే వారి గెలుపుకోసం భర్త లు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అర్థాంగిని ఎలాగైన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిపించేందుకు వారి వెంట జెండా పట్టుకొని ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు.

రిజర్వేషన్ల తారుమారుతో...

బెల్లంపల్లి మున్సిపాలిటిలో మొత్తం 34 వార్డులు ఉండగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ 50శాతం మహిళలకు కేటాయించింది. దీంతో ఆయా పార్టీల నుంచి మహిళ అభ్యర్థులు పోటిలో నిలబడ్డారు. అంతేగాకుండా మహిళలకు రిజర్వేషన్లు కలిసి రావడం తో రాజకీయంలో ఆసక్తి ఉన్నవారు స్వతంత్ర అభ్యర్థు లుగా పదుల సంఖ్యలో మహిళలు పోటి చేస్తున్నారు. 50శాతం మహిళా రిజర్వేషన్లు కావడంతో దాదాపు 60 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల అదికారులు రిజర్వేషన్లు ప్రకటించిన సమయంలో మహిళలకు 50శాతం కేటాయించారు. దీంతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. చేసేదేమిలేక తమ భార్యలను ఎన్నికల బరిలో నిలబెట్టారు. వీరు పోటి చేసే చోట సతీమణి గెలుపుకోసం పతులు పాట్లు పడుతున్నారు. మహిళ అభ్యర్థుల కోసం వారి భర్తలు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ మా భార్యకే ఓటు వేసి పట్టం కట్టాలని ఓటర్ల వద్ద విన్నవించుకుంటున్నారు.

పురపీఠం కోసం ముమ్మర యత్నాలు...

బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో తమ సతీమణులను ఆయా వార్డుల్లో ఎన్నికల బరిలో నిలెబెట్టారు. ఎలాగైన పురపీఠం దక్కించుకోవాలని సతీమణులతో భర్తలు ప్ర చారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జనరల్‌ మహిళకు కేటాయించడంతోనే పలువురు నాయకులు చైర్‌పర్సన్‌ పీఠం కోసం తమ భార్యలను పోటిలో నిలబెట్టారు. కౌన్సిలర్‌ అభ్యర్థిగా తమ సతీమ ణులను గెలిపించుకుంటే పురపీఠం కైవసం చేసుకోవ చ్చుననే యోచనలతో ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నా రు. ఏదేమైన ఎన్నికల కమిషన్‌ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌లు కేటాయించడం మరోవైపు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం సైతం మహిళలకే రిజర్వేషన్‌ దక్కడంతో తమ భార్యల గెలుపు కోసం భర్తలు పాటుపడాల్సి వస్తోంది.

Updated Date - Feb 08 , 2026 | 12:03 AM