మూర్ఖమైన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:50 AM
ప్రభుత్వం మూర్ఖంగా ఉందని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో వేలకోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, కమీషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్లలో బీఆర్ఎస్ తెలంగాణ
సిరిసిల్ల, అక్టోబరు 26 (ఆంరఽధజ్యోతి): ప్రభుత్వం మూర్ఖంగా ఉందని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో వేలకోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, కమీషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్లలో బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో ఉన్న ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేటీఆర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎన్హెచ్ఎం రాష్ట్ర కమిటీ నాయకులతో చర్చించి అసెంబ్లీలో పోరాడుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మూర్ఖంగా ఉందని, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులతో సహా ఏ వర్గం సంతోషంగా లేదని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను తన్ని తరిమేసే అంతగా కోపంగా ఉన్నారని అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆరు నెలల్లో రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం చేయడం లేదని అన్నారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఆరు నెలల్లో ఉద్యోగులందరికీ పీఆర్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారని, ఏడు డీఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా పీఆర్సీ ఇచ్చామని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చేశామని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని వృధాగా కిందికి వదిలేస్తూ, చిన్న మరమ్మతులు చేస్తే సరిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాల కోసం బద్నామ్ చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వెంట నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ ఇంచార్జి చెల్మేడ లక్ష్మీనరసింహారావు తదితరులు ఉన్నారు.