మెనూ ప్రకారం విద్యార్థినులకు ఆహారం అందించాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:27 PM
విద్యార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్ అన్నారు.
- డీఈవో రమేశ్ కుమార్
తిమ్మాజిపేట, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్ అన్నారు. తిమ్మాజిపేటలో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా న్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. వి ద్యాలయంలోని వసతులను మధ్యాహ్న భో జనాన్ని పరిశీలించారు. వసతి గృహంలో ఉండే సౌకర్యాలు తాగునీరు విద్యాబోధన వంటి పలు అంశాలపై అభిప్రాయాలను విద్యార్థిను లను అడిగారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఇటీవల కేజీబీవీని సంద ర్శించిన ప్రాంతీయ విద్యా సంచాలకుడు సోమి రెడ్డి సూచనల మేరకు కంప్యూటర్‌కు సంబం ధించిన టేబుళ్లను అందజేసి ప్రైవేట్ పాఠశాల ల యజమానులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఎంఈవో సత్యనారాయణశెట్టి, ప్రత్యేక అధికారి సుజాత పాల్గొన్నారు.