రోడ్డెక్కిన అన్నదాతలు
ABN , Publish Date - May 22 , 2026 | 12:38 AM
ఆరుగాలం శ్రమించి ఎండననక, వాననక పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోగా ధాన్యా న్ని గోదాముల్లో అన్‌లోడ్ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తుందని పేర్కొంటూ మండల రైతులు గురువారం రోడ్డెక్కారు.
స్థానిక గోదాముల్లోనే ధాన్యం అన్‌లోడ్ చేయాలని రాస్తారోకో
చెన్నూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం శ్రమించి ఎండననక, వాననక పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోగా ధాన్యా న్ని గోదాముల్లో అన్‌లోడ్ చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తుందని పేర్కొంటూ మండల రైతులు గురువారం రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజుల నుంచి గిడ్డంగుల ముందు పడి గాపులు కాస్తున్నా సంబంధిత శాఖ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల నుంచి తామే స్వయంగా ధాన్యాన్ని తూకం వేసుకుని సొంత రవాణా ఖర్చులతో గోదాముల వద్దకు తీసుకువస్తే సంబంధిత అధికారులు మాత్రం అన్‌లోడ్ చేసుకోవడం లేదని వా పోయారు. వాహనాల కిరాయిని ప్రభుత్వమే భరించా లని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహ దారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారి 63పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లకు గుర య్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్ అక్కడకు చేరుకుని రైతులను సముదాయించారు. సం బంధిత శాఖ అధికారులతో మాట్లాడి ధాన్యాన్ని గోదా ముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొ నడంతో రైతులు ఆందోళన విరమించారు.