kumaram bheem asifabad- రోడ్డు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:53 PM
వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిం చాలని ఎస్సై రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
జైనూర్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటిం చాలని ఎస్సై రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రహదారి భద్రత కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్ప నిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలని ఎస్సై మధుకర్ అన్నారు. శుక్రవారం పోలీసులు, యువకులతో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సాకడ ఎక్స్ రోడ్డు నుంచి గ్రామం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెంట్ ధరించాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని ఎస్సై సర్తాజ్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ నుంచి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోసునీత, ఉపాధ్యాయులు తిరుపతి, వార్డు సభ్యుడు తిరుపతి పాల్గొన్నారు.