నీటి వనరుల వినియోగంపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:26 PM
ప్రస్తుత నెలకొన్న ఎల్ ని నో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి వనరుల విని యోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం హైద్రాబాద్ నుంచి వీడి యోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హాజీపూర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత నెలకొన్న ఎల్ ని నో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి వనరుల విని యోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం హైద్రాబాద్ నుంచి వీడి యోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ అధికారులు నీటి పొదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రబీ సీజన్‌లో రైతులు వరి సాగు చేయవద్దని, బిందు సేద్యంతో ఆ యిల్‌ఫాం, కూరగాయలు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంట లను సాగు చేయాలన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుగు గుంతలు,నీటి కుంటలు, ఊట, పంట కుంటల పనులను చేపట్టి జల వనరులను కాపాడుకోవాలన్నారు. హాజీపూర్ మండలం గుడిపేటలో ని రైతు వేదికలో కలెక్టర్ కుమార్ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్ద ఆదేశాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాత నమోదు, వరి మినహా ఆరుతడి, ఆయిల్‌ఫాం, పం దిరి సాగు వంటి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి అప్రమత్తం చేస్తామ న్నారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి, మండల ప్రత్యేకాధికా రి యాకూబ్, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ఉద్యానవన అధికారి అనిత పాల్గొన్నారు.