Share News

యాసంగి సీజన్‌ ప్రణాళికపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:17 PM

రాబోయే యాసంగి సీజన్‌ ప్రణాళిక, విద్య, భూసేకరణ అం శాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, సం బంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు.

యాసంగి సీజన్‌ ప్రణాళికపై దృష్టి సారించాలి

- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబర్‌ 13(ఆంధ్రజ్యోతి) : రాబోయే యాసంగి సీజన్‌ ప్రణాళిక, విద్య, భూసేకరణ అం శాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు, సం బంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టా లని, రైతులకు అవసరమైన సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు సూక్ష్మ సేద్యం, ఉద్యానవన శాఖల స మన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రైతు నమో దు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రాయితీ విత్తనాల పంపిణీ, పంటల మార్పి డి, సూక్ష్మ సేద్య పరికరాల వినియోగంపై రైతులకు అ వగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో వి ద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును నిరంతరం పర్య వేక్షించాలని, సగటున రాష్ట్రస్థాయిలో విద్యార్థుల హాజ రు 73.74 శాతం ఉండగా, జిల్లా స్థాయిలో 72.21 శా తంగా ఉందని, ఉపాధ్యాయుల హాజరు రాష్ట్ర స్థాయిలో 87.06 శాతం, జిల్లా స్థాయిలో 88.05 శాతంగా నమో దు అయిందని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరుకు అనుగుణంగా విద్యార్థుల హాజరు పెరిగేలా చర్యలు తీ సుకోవాలని తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు సం బంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఆదేశాలను త ప్పనిసరిగా పాటించాలని సూచించారు. కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అ ధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నా రు. రబీ సాగుకు సంబంధించి రైతులకు తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుతో పా టు రాయితీ విత్తనాల పంపిణీపై అవగాహన కల్పిస్తా మన్నారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలను అధికా రుల సమన్వయంతో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నతో పాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా, ప్రభుత్వ విద్య సంస్థలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చ ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:17 PM